ఈ టన్నెల్ నుంచి నడిస్తే వైరస్ ల ఖేల్ ఖతం...

ఈ టన్నెల్ నుంచి నడిస్తే వైరస్ ల ఖేల్ ఖతం...
x
Hyderabad DGP Office
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరిశుభ్రతను పాటిస్తూ, సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. శానిటైజర్స్, మాస్కులు, ధరిస్తున్నారు. నిత్యం హ్యాండ్ వాష్ లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాష్ట్రంలో మాత్రం కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు మనిషి నుంచి అన్నిరకాల ఇన్ఫెక్షన్లను దూరం చేయడానికి ఓ వినూత్న పరికరం ఏర్పాటు చేసారు. దానికి సేఫ్ టన్నెల్ అని పేరు కూడా పెట్టారు. కొత్తగా రూపొందించిన దీన్ని తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. ఎస్-3-వీ వాస్కులర్ టెక్నాలజీస్ సాయంతో ఏర్పాటు చేసిన ఈ టన్నెల్‌ను డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు.

సాంకేతిక సాయంతో ఏర్పాటు చేసిన ఈ 'సేఫ్ టన్నెల్'కు ఎన్నో రకాల సూక్ష్మక్రిములను అరికట్టే శక్తి ఉందని టన్నెల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇందులో నుంచి కేవలం 20 సెకన్ల పాటు అటునుంచి వాకింగ్ చేస్తే మనిషి శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుందని తెలిపారు. ఈ సేఫ్ టన్నెల్ పనితీరును వాస్కులర్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు అదికారులతో మాట్లాడుతూ టన్నెల్ నుంచి వెల్లిన వారికి 1.5 మైక్రాన్ల నుంచి 20 మైక్రాన్ల పరిమాణం వరకు ఉండే పరమాణువుల సూక్ష్మక్రిములను డిస్-ఇన్ఫెక్ట్ చేస్తుందని తెలిపారు. దీంతో ఈ టన్నెల్ పనితీరును సీనియర్ పోలీస్ అధికారులందరూ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, అడిషనల్ డీజీలు జితేందర్, ఉమేష్ ష్రాఫ్, రాజీవ్ రతన్, శివధర్ రెడ్డి, ఐజీలు సంజయ్ జైన్, నాగిరెడ్డి పాల్గొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories