గచ్చిబౌలి స్టేడియంలో 'రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌'

గచ్చిబౌలి స్టేడియంలో రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌
x
Highlights

మన దేశంలో మహిళలన్నా, బాలికలన్నా చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. అయితే ఇలాంటి వారిలో మార్పు స్పష్టంగా రావాలని ప్రయత్నిస్తున్నారు.

మన దేశంలో మహిళలన్నా, బాలికలన్నా చాలామంది చిన్నచూపు చూస్తున్నారు. అయితే ఇలాంటి వారిలో మార్పు స్పష్టంగా రావాలని ప్రయత్నిస్తున్నారు. అమ్మాయిలు పుడితే మైనస్ అనుకునే రోజునుంచి బయటకు రావాలని, అబ్బాయే పుట్టాలనే ఆలోచన నుంచీ అమ్మాయి పుట్టినా పర్వాలేదని సర్దుకుపోయే మనస్తత్వం రావాలని కోరుకుంటున్నారు. అమ్మాయి పుడితే బాగుండు అనుకునే రోజులు రావాలని, భ్రూణ హత్యలను అరికట్టాలని హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్టేడియంలో ఉద‌యం చేపట్టారు. ఇందులో భాగంగా 5కె, 10కె, 21కె పేరిట వేర్వేరు విభాగాల్లో నిర్వాహకులు పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో బాలికలు, పెద్దలు, యువతులు హాజరయి పరుగులు తీసారు. ఈ కార్యక్రమం నిర్వహించడం వలన వచ్చిన ఆదాయాన్ని బాలికల చదువుకు వినియోగించనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ బాలికల పట్ల, మహిళల పట్ల మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. స్త్రీ లేనిదే సృష్టి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories