పండ్ల తోటలకు కొత్త వైరస్...నష్టాల్లో రైతులు

పండ్ల తోటలకు కొత్త వైరస్...నష్టాల్లో రైతులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. పెరుగుతున్న కాలుష్యం, ఆహారఅలవాట్లలో మార్పుల వలన మనుషులు కొత్త కొత్త వైరస్ ల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు.

ప్రపంచంలో రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. పెరుగుతున్న కాలుష్యం, ఆహారఅలవాట్లలో మార్పుల వలన మనుషులు కొత్త కొత్త వైరస్ ల బారిన పడి అనారోగ్యం పాలవుతున్నారు. అదే విధంగా పక్షులు జంతువులకు కూడా కొత్త వైరస్ లు వచ్చి చనిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటికి మొన్న ఖమ్మం జిల్లాలో ఏదో తెలియని వింత వైరస్ సోకి ఏకంగా 30వేల కోళ్లు చనిపోయాయి. ఇప్పుడు ఇదే నేపథ్యంలో పండ్ల తోటలకు కూడా ఏదో కొత్త రకం వైరస్ సోకుతుంది. అది రాష్ట్రాలన్నీ పాకుతూ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సోకడం మొదలయింది.

పండ్లతోటలని నాశనం చేసే వైరస్ పేరు రుగోస్ వైరస్. ఇది మొట్టమొదటిసారి కేరళలో గుర్తించారు. ఈ వైరస్ ముందుగా కేరళ మొదలయి అప్పకినుంచి తమిళనాడుకు పంటలకు సోకింది. తరువాత ఆంధ్రప్రదేశ్‌కు, ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో పంటలకు సోకుతోందని తెలిసింది. ఇప్పటి వరకూ ఈ వైరస్ సోకడంవలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో 10,226 హెక్టార్లలో కొబ్బరి, 11,774 హెక్టార్లలో అయిల్‌పామ్ సాగును నష్టపరిచిందని అక్కడి రైతులు పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ఈ వైరస్ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అయిల్‌పామ్‌లకు సోకుతుంది. దీంతో రైతులు ఈ వైరస్ మరిన్ని పంటలకు విస్తరించకుండా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా అరటి, జామ, సీతాఫలం పండ్ల తోటలపై కూడా పడనుందని రైతులు చెబుతున్నారు.

అంతే కాదు ఈ వైరస్ అతి వేగంగా వ్యాప్తి చెందే సూక్ష్మక్రిమి అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ వైరస్ తెల్లదోమ వలన వ్యాప్తిచెందుతుందని తెలుపుతున్నారు. ఇది ముందుగా మొక్కలోని రసాన్ని పీల్చి వేస్తుంది. దీంతో ఆకులు జీవాన్ని కోల్పోయి ఎండిపోతాయి, అంతే కాదు ఈ కారణంగా కొమ్మలు రాలడం ప్రారంభం అవుతుంది. చెట్లపై తెల్లదోమ వాలడం వలన వాటి మలమూత్రాల వల్ల చెట్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది.

దీనివల్ల పైర్లు, చెట్లు వ్యాధిగ్రస్తం కావడంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోతునట్టు శాస్తవ్రేత్తల పరిశోధనలో తేలింది. దీంతో పరిశోధకులు ఈ వైరస్ ను అరికట్టడానికి సపోర్టు ఇసారియా ఫంగస్‌ను ఉచితంగా రైతులకు ఇస్తున్నారు. ఈ ఫంగస్ వైరస్ ను కట్టడి చేస్తుందని దీంతో ఎక్కువ శాతం అది విస్తరించకుండా నాశనం అవుతుందని అధికారులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories