వరంగల్ లో అతి రుద్ర యాగం

వరంగల్ లో అతి రుద్ర యాగం
x
ఎర్రబెల్లి దయాకర్‌రావు
Highlights

తెలంగాణ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలని అతిరుద్రయాగాన్ని మంత్రులు ప్రారంభించారు.

తెలంగాణ ప్రాంత ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రంలో పంటలు సుభిక్షంగా పండాలని అతిరుద్రయాగాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ యాగాన్ని హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహిస్తున్నారు. ఈ పవిత్ర కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎంపీ పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ హాజరయ్యారు.

ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించనున్నారని మంత్రులు తెలియజేసారు. వరంగల్ లో ఇంతటిపుణ్య కార్యక్రమం నిర్వహించడం ఎంత ఆనందంగా ఉందని మంత్రులు అన్నారు. వేద మంత్రాల నడుమ నిర్వహించే ఈ యాగ ప్రాంగణమంతా విద్యుత్తు దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భోలా శంకరుడి ఆకారంలో వేద బ్రాహ్మణులు ముగ్గులు వేయించారు. శివుణ్ని ఆరాధించేందుకు రుద్రాభిషేకం అత్యం శ్రేష్టమైనది. వేద పండితులు రుద్రపారాయణం పఠిస్తూ శంకరుడిని అభిషేకిస్తారు. అట్టహాసంగా ప్రారంభించిన ఈ యాగానికి వేద పండితులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వరంగల్ లో నివసించే ప్రతి ఒక్కరు యాగ ప్రాంగనాని రావాలని అందరినీ ఆహ్వానించారు. ఈ యాగానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories