ఆర్టీసీ లాభాల కోసం.. కేసీఆర్ మరో కీలక నిర్ణయం

ఆర్టీసీ లాభాల కోసం.. కేసీఆర్ మరో కీలక నిర్ణయం
x
కేసీఆర్
Highlights

ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం...

ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు. అంతేకాకుండా ఎంప్లాయిస్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, ఆర్టీసీ కార్గో సర్వీసులై రవాణాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను కచ్చితంగా ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారానే జరగాలని నిర్ణయించారు.

తెలంగాణ ఆర్టీసీపై ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హమీల అమలు అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచిన ఫైల్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ఈ సందర్భంగా కార్గో సర్వీసులపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ చర్చించారు. రాష్ట్రంలో పల్లె పల్లెకు రవాణాసౌకర్యం ఉండటంతో సరకు రవాణా మారుమూల ప్రాంతానికైనా చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా జరిగే సరుకు రవాణాను ఇకపై ఆర్టీసీ కార్గో అండ్ పార్శిల్ సర్వీస్ ద్వారానే చేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి అన్ని శాఖలకు కచ్చితమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. బతుకమ్మ చీరలు, విద్యా సంస్థలకు పుస్తకాలు, డిపోల నుంచి వైన్ షాపులకు మద్యం, హాస్పిటళ్లకు మందులు ఇలా ప్రభుత్వ పరంగా జరిగే ప్రతీ సరుకు రవాణా ఇకపై ఆర్టీసీ కార్గో ద్వారానే జరిగేట్లు చూస్తామన్నారు. అంతేకాకుండా ప్రజలు తమ సరుకులను రవాణా చేయడానికి ఆర్టీసీ కార్గో సర్వీసులను ప్రోత్సహించాలని కేసీఆర్ సూచించారు.

మరోవైపు ఆర్టీసీ ఎంప్లాయిస్‌ వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. బోర్డులో ప్రతీ డిపో ప్రధాన కార్యాలయం నుంచి ఇద్దరు చొప్పున ఉద్యోగులు మొత్తం 202 మంది సభ్యులుగా ఉంటారు. ఇందులో 94 మంది బీసీలు, 38 మంది ఎస్సీలు, 26 మంది ఎస్టీలు, 44 మంది ఓసీలు ఉంటారు. మొత్తం సభ్యుల్లో మహిళా ఉద్యోగులు 73 మంది ఉండనున్నారు. బోర్డు సమావేశంలో ఉద్యోగులకు ఎదురయ్యే సమస్యలు, ఇబ్బందులను పరిష్కరిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories