Top
logo

చార్మినార్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు

చార్మినార్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు
X
Highlights

చార్మినార్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న మోహన్...

చార్మినార్ వద్ద ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రత్యేక పూజలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న మోహన్ భగవత్ .. అమ్మవారికి విశేషే పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోహన్ భగవత్ వెంట భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. మోహన్ భగవత్ రాకతో చార్మినార్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

మొదటి సారి మోహన్ భగవత్ హైదరాబాద్ గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటున్నారు. కాసేపట్లో ఎంజే మార్కెట్ వద్ద మోహన్ భగవత్ గణేష్ ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆర్ఎస్ఎస్ చీఫ్‌తో పాటు ప్రజ్ఞా మిషన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రజ్ఞానానాజీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జనానికి వెళ్లే వినాయక విగ్రహాలకు పూజలు చేయనున్నారు.

Next Story