రైతు వేదికల నిర్మాణానికి రూ. 40 లక్షల విరాళం

రైతు వేదికల నిర్మాణానికి రూ. 40 లక్షల విరాళం
x
Highlights

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను రూపొందించిన విషయం తెలిసిందే.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కేసీఆర్ రైతుల కోసం మరో నిర్ణయానికొచ్చారు. రైతు సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణానికి సంకల్పించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు తమ వంతు సహకారం అందించేందుకు దాతలు ముందుకొస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలోని రామాయంపేటలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కాగా మంత్రి కేటీఆర్ భార్య శైలిమ తాత గారైన దివంగత నూలి హనుమంతరావు పేరిట వారి కుటుంబీకులు ఈ భవన నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును ఆర్థిక సహాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ భవన నిర్మాణానికి సుమారుగా రూ.40 లక్షల ఖర్చు అవుతుందని, ఈ భవనాన్ని నెల రోజుల్లోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ భవన నిర్మాణం పూర్తయిన తరువాత ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories