ఇంటి నిర్మాణం ఇక చాలా ఈజీ.. గంటల వ్యవధిలో ఇంటిని నిర్మిస్తున్న రోబో

ఇంటి నిర్మాణం ఇక చాలా ఈజీ.. గంటల వ్యవధిలో ఇంటిని నిర్మిస్తున్న రోబో
x
Highlights

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా అంత ఇబ్బందులు ఉంటాయన్నది దాని సారాంశం. అయితే, పెళ్లి...

ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఎందుకంటే పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా అంత ఇబ్బందులు ఉంటాయన్నది దాని సారాంశం. అయితే, పెళ్లి చేయడానికి ఎలా ఈవెంట్ సంస్థలు వచ్చాయో అలాగే ఇల్లు కూడా ఇక ఎలాంటి ఇబ్బంది లేకుండా గంటల వ్యవదిలోనే పూర్తవుతుంది. ఇల్లు నిర్మాణం ఏంటి..? గంటల వ్యవధిలోనే పూర్తవడం ఏంటనుకుంటున్నారా.. ? అయితే ఈ రోబోతో కట్టే ఇల్లును మీరు చూడండి.

సాధారణంగా ఇల్లు కట్టాలంటే కొన్ని నెలల సమయం పడుతుంది. అది కూడా మనం దగ్గరుండి నిర్మాణం చేయించుకుంటేనే అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పడుతుంది. సమయానికి కూలీలు దొరక్క నానా అవస్థలు పడాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో బిల్డర్‌కు ఇచ్చి నిర్మాణం చేయమని చెప్పినా కరెక్ట్ డేట్‌‌కు ఇల్లు అందించలేరు. అదికూడా నెలల సమయం పడుతుంది.

ఇక అలాంటి ఇబ్బందులు అక్కర్లేదంటోంది ఈ రోబో. నెలల తరబడి కట్టే ఇంటిని గంటల్లో పూర్తి చేస్తామంటున్నారు దీని నిర్వాహకులు. చిన్న రూమ్‌ను కేవలం 5గంటల్లో నిర్మిస్తామంటున్నారు. 2వేల స్కేర్‌ ఫీట్ ఇంటిని కేవలం7రోజుల్లో పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. సాధారణంగా కూలీలు నిర్మించే ఇంటికంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, ఇది కట్టే సమయంలో క్యూరింగ్ కోసం నీళ్లు కూడా అవసరం లేదంటున్నారు రోబో నిర్వాహకులు.

సాధారణంగా కట్టే ఇంటి నిర్మాణానికి అవసరమైన డబ్బుల కంటే ఈ రోబో ద్వారా కట్టే ఇంటికి తక్కువ ఖర్చవుతుందని, మనకు కావాల్సిన రూపంలో ఇంటిని త్రీడీ డిజైన్ చేసి రోబోకు అనుసంధానం చేసిన కంప్యూటర్‌లో పెడితే గంటల వ్యవధిలోనే ఇల్లు రెడీ అవుతుందంటున్నారు నిర్వాహకులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories