హన్మకొండ ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో బియ్యం అక్రమ తరలింపు

హన్మకొండ ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో బియ్యం అక్రమ తరలింపు
x
Highlights

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జూలైవాడ ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తుండగా విద్యార్థులు పట్టుకున్నారు. హాస్టల్ నుంచి ఉదయం 3 గంటలకు బియ్యం తరలింపుపై విద్యార్థులు ఆందోళనకు దిగారు.

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ జూలైవాడ ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో బియ్యం బస్తాలు అక్రమంగా తరలిస్తుండగా విద్యార్థులు పట్టుకున్నారు. హాస్టల్ నుంచి ఉదయం 3 గంటలకు బియ్యం తరలింపుపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. వార్డెన్ ప్రమేయంతోనే వర్కర్లు తరలించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వార్డెడ్ సపోర్టు చేయడం ద్వారానే వాచ్ మన్ విజయ ఈ అక్రమంగా బియ్యం తరలింపు పాల్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న కూడా అక్కడి అధికారులు పట్టించుకోలేదని విద్యార్థులు వాపోతున్నారు. అయితే హస్టల్ వార్డెన్ రాధిక మాత్రం వాచ్ మెన్ చేసిన పనికి తనకు ఎలాంటి సంబంధంలేదని చెబుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories