అధికారుల పనితనం : 5 ఎకరాల రైతును 90 ఎకరాల రైతును చేసారు ..

అధికారుల పనితనం : 5 ఎకరాల రైతును 90 ఎకరాల రైతును చేసారు ..
x
Highlights

రెవెన్యూ అధికార్ల పనితనం మరోసారి బయటపడింది . ఐదు ఎకరాలు ఉన్న రైతును ఏకంగా 90 ఎకరాల రైతును చేసేసారు . ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి...

రెవెన్యూ అధికార్ల పనితనం మరోసారి బయటపడింది . ఐదు ఎకరాలు ఉన్న రైతును ఏకంగా 90 ఎకరాల రైతును చేసేసారు . ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది . మీనమోనిపల్లి గ్రామానికి చెందిన అనపోసల బుచ్చయ్య అనే రైతుకు కేవలం 5.395 ఎకరాల పొలం మాత్రమే ఉంది. కానీ ఇది వివిధ సర్వే నెంబర్ లో ఉంది . అయితే బుచ్చయ్యకు రైతుబంధు పైసలు రాకపోవడంతో వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు అయ్యాడు . అయితే దీనిపైన వ్యవసాయ అధికారులు నీకు 90 ఎకరాల భూమి ఉందని, పెద్ద రైతులకు ఇంకా పైసలు జమ కాలేదని చెప్పుకొచ్చారు .

దీనితో అనుమానం వచ్చిన బుచ్చయ్య తనకి సంబంధించిన భూమిపై ఆర్వోఆర్ తీశాడు . అందులో కేవలం ఎకరం పొలంకి బదులుగా 87.28 ఎకరాలుగా ఉన్నట్టుగా చూపించింది . దీనితో అధికార్ల తప్పు బయటపడింది ,అయితే దీనిని సరి చెయ్యండని బుచ్చయ్య అధికారుల చుట్టూ తిరిగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు . అయితే ఇదే విషయంపై స్థానిక ఇన్‌ చార్జ్‌‌ తహసీల్దార్‌‌ను ప్రశ్నించగా దీనిపైన ఇప్పటికే వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళమని త్వరలోనే దీనిని సరి చేస్తామని చెప్పుకొచ్చారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories