ఏసీబీ వలలో వసూల్‌రాజాలు

ఏసీబీ వలలో వసూల్‌రాజాలు
x
Highlights

భూమికి పట్టా ఇవ్వాలంటే లంచం పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే లంచం ఆన్‌లైన్‌లో ఎక్కించాలంటే ఆఫ్‌ లైన్‌లో డబ్బులు చెల్లించాల్సిందే. ఇది తెలంగాణలో రైతులకు...

భూమికి పట్టా ఇవ్వాలంటే లంచం పాస్ పుస్తకం మంజూరు చేయాలంటే లంచం ఆన్‌లైన్‌లో ఎక్కించాలంటే ఆఫ్‌ లైన్‌లో డబ్బులు చెల్లించాల్సిందే. ఇది తెలంగాణలో రైతులకు ఎదురవుతున్న పరిస్దితులు. నిన్న ఒక్క రోజే వేర్వేరు చోట్ల రెవిన్యూ అధికారులు ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యారు. రైతుల నుంచి లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

నరేందర్ రెడ్డి దుండిగళ్ ఎమ్మార్వో కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి భూమిని ఆన్ లైన్ లో ఎక్కించడం కోసం 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో పక్కా పథకం ప్రకారం లంచం ఇస్తుండగా దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి దగ్గర లభించిన ఆధారాలతో ఎమ్మార్వో కార్యాలయంతో పాటు నరేందర్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అన్ని రకాల పత్రాలు ఉన్నా భూమిని ఆన్‌లైన్‌ ఎక్కించాలని ఎన్నిసార్లు కోరినా ఎమ్మార్వో కార్యాలయం పట్టించుకోలేదని రైతు శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాసులిస్తే గాని కంప్యూటర్‌లో ఎక్కడం లేదంటూ మండిపడ్డాడు.

ఇక వరంగల్ రూరల్ జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. రాయపర్తి మండలం కొండూరుకు చెందిన భాషబోయిన రామస్వామి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీదకు మార్చాలంటూ రెవిన్యూ అధికారులను కోరాడు. దీనికి సంబంధించి అధికారులు అడిగిన అన్ని పత్రాలు సమర్పించారు. అయినా ఇదిగో అంటూ కాలయాపన చేసిన అధికారులు లంచం ఇస్తే కాని పని పూర్తి కాదంటూ తేల్చి చెప్పారు. 7 వేల 500 రూపాయలు ఇస్తే వారంలో ఆన్‌లైన్‌లోకి ఎక్కిస్తామన్నారు. దీంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సూచన మేరకు 7 వేల 500 లంచం ఇస్తుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు వీఆర్వో ఎల్లయ్యను అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తుంటే కొందరు అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ అటు ప్రభుత్వానికి ఇటు రెవిన్యూ విభాగానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఈ నేపధ్యంలో తమ సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలంటూ రైతులు కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories