logo

తహశీల్దార్‌ సజీవ దహనం.. రేవంత్‌ ట్వీట్‌

తహశీల్దార్‌ సజీవ దహనం.. రేవంత్‌ ట్వీట్‌
Highlights

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిపై తహశీల్దార్‌ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై...

అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్‌ విజయారెడ్డిపై తహశీల్దార్‌ కార్యాలయంలోనే కిరోసిన్ పోసి సజీవదహనం చేయడంపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంపై ఎంపీ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ట్విట్టర్ లో స్పందించిన ఆయన, తహశీల్దార్ విజయారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న అధికారులకు ప్రభుత్వం సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు కారకులైన నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని ట్వీట్ చేశారు.
లైవ్ టీవి


Share it
Top