ఎట్టకేలకు ప్రగతిభవన్‌కు రేవంత్‌రెడ్డి..పోలీసుల కళ్లుగప్పి..

ఎట్టకేలకు ప్రగతిభవన్‌కు రేవంత్‌రెడ్డి..పోలీసుల కళ్లుగప్పి..
x
Highlights

ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి గృహనిర్బంధంలో ఉన్న రేవంత్‌ పోలీసుల కళ్లు గప్పి బైక్‌పై తప్పించుకున్నారు. తన అనుచరులతో ఇంటి...

ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌కు వచ్చారు. ఉదయం నుంచి గృహనిర్బంధంలో ఉన్న రేవంత్‌ పోలీసుల కళ్లు గప్పి బైక్‌పై తప్పించుకున్నారు. తన అనుచరులతో ఇంటి నుంచి బయటకొచ్చిన ఆయన్ను మొదట పోలీసులు అడ్డుకున్నారు. అయితే తన అనుచరుల సాయంతో మొదట పరుగులు పెట్టిన రేవంత్‌ ఆపై పోలీసుల నుంచి తప్పించుకుని బైక్‌పై ప్రగతిభవన్‌కు వెళ్లారు.

ఇటు ప్రగతిభవన్‌కు వచ్చిన రేవంత్‌ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతానికి ప్రగతిభవన్‌ ను ముట్టడించామని ఇక ముందు ప్రగతిభవన్‌ను బద్దలు కొడతామని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories