సీఎం పై మండిపడ్డ ఎంపీ రేవంత్ రెడ్డి

సీఎం పై మండిపడ్డ ఎంపీ రేవంత్ రెడ్డి
x
ఎంపీ రేవంత్ రెడ్డి
Highlights

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వాఖ్యలు చేశారు. ఆలయాలను పునరుద్ధరించడానికి, సెక్రెటేరియట్ ...

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వాఖ్యలు చేశారు. ఆలయాలను పునరుద్ధరించడానికి, సెక్రెటేరియట్ నిర్మించడానికి నిధులను వాడుతున్నారన్నారు. రెండు వేల కోట్ల రూపాయలతో సెక్రెటేరియట్ నిర్మాణానికి నిధులు కేటాయించిన కేసీఆర్ కి ఆర్టీసీకి ఇచ్చేందుకు రూ.49 వేల కోట్లు లేవా? అని ప్రశ్నించారు.

ఆర్టీసీకి మూడు వేల కోట్లు అప్పులున్నాయని ప్రైవేటు పరం చేస్తామంటున్నారు. మరి రూ.30 వేల కోట్ల అప్పున్న మెట్రో రైల్ ను ఏంచేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కు విలాసవంతమైన జీవతమే కావాలి కాని పేదవాళ్లు ఎక్కే ఎర్రబస్సుల గురించి ఆయనకు పనేంటని మండిపడ్డారు. ఆర్టీసీలో 33 శాతం వాటా ఉందంటున్న కేంద్ర ప్రభుత్వం కార్మికుల చావులను మాత్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు. వారి చావులను కూడా 66 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 33 శాతం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులు బాధలను దృష్టిలో పెట్టుకుని కార్మికులకు న్యాయం చేయాలన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories