జూనియర్ కాలేజీల ప్రారంభం వాయిదా

జూనియర్ కాలేజీల ప్రారంభం వాయిదా
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి ప్రారంభించాల్సిన జూనియర్‌ కాలేజీల ప్రారంభాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు వాయిదా వేసింది.

తెలంగాణ రాష్ట్రంలో జూన్‌ 1 నుంచి ప్రారంభించాల్సిన జూనియర్‌ కాలేజీల ప్రారంభాన్ని ఇంటర్మీడియట్‌ బోర్డు వాయిదా వేసింది. ఇంటర్మీడియట్‌ అకడమిక్‌ కేలండర్‌ ప్రకారం వేసవి సెలవులు ముగుసి జూన్ మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన తరగతులను కరోనా నేపథ్యంలో ప్రారంభించడం లేదని, బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ తెలిపారు. తరగతులు ఎప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తాం అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని ఎప్పుడు ప్రారంభిస్తామనేది తరువాత తెలియజేస్తామన్నారు.

కరోనా నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర పరీక్షల్లో జియాగ్రఫీ పేపరు–2, మోడర్న్‌ లాంగ్వేజ్‌ పేపరు–2 పరీక్షలు వున్నాయని, వాటిని జూన్‌ 3న నిర్వహించనున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్‌ తెలిపారు. ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఇంటర్ అఫిశల్ వెబ్సైట్ నుంచి హల్ టికెట్ తీసుకోవాలని సూచించారు.

ఇక ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల తరువాత ఉత్తిర్నులు కానీ వారికి జూలై మూడో వారంలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. జూన్ 3వ తేదీన నిర్వహించే పరీక్షలకు రవాణా సదుపాయం, ఇతరత్రా కారణాలతో పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ సబ్జెక్టులను రాసుకోవచ్చని తెలిపారు. అపుడు పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణనలోకి తీసుకుంటామని వివరించారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories