Top
logo

తెలంగాణ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ భారీ విరాళం

తెలంగాణ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ భారీ విరాళంreliance industries donates five crores to telangana cm relief fund
Highlights

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలకి చేస్తున్న

కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలుపెరుగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.. ప్రభుత్వాలకి చేస్తున్న ఈ పోరాటానికి స్వచ్చంధ సంస్థలు, సినీ తారాలు, క్రీడా ప్రముఖులు తమ వంతుగా సహాయం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు. తాజాగా రిలయన్స్ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి అయిదు కోట్ల విరాళంగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించింది.

రిలయన్స్ జియో తెలంగాణ సీఈఓ కేసీ రెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల అధికారి కమల్ పొట్లపల్లి శుక్రవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి చెక్ ని అందజేశారు. ఈ మేరకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు రిలయన్స్ సంస్థ పీఎం కేర్స్ సహాయ నిధికి రూ.530 కోట్ల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే

Web Titlereliance industries donates five crores to telangana cm relief fund
Next Story