సబ్సిడీ నిధులను విడుదల చేయాలి : కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం

సబ్సిడీ నిధులను విడుదల చేయాలి : కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం
x
Highlights

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం ఎంపీడీఓలను ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా స్వయం ఉపాధి పథకం కింద లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం ఎంపీడీఓలను ఆదేశించారు. ఎంపీడీఓలు, ఏపీఓలతో గురువారం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా బ్యాంకర్లతో మాట్లాడిన కలెక్టర్ అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాలను త్వరగా మంజూరు చేయాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన నాటుకోళ్ల పెంపకం పథకాన్ని వితంతువు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు.

హరిత హారం సందర్భంగా నాటిన చెట్లకు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల పేర్లు, వారికి సంబంధించిన ఫోన్ నంబర్ లతో ఉన్న బోర్డులను వ్రేలాడదీయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా, 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆమె అధికారులను కోరారు. రద్దీ ప్రదేశాలలో మరుగు దొడ్ల ను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ శ్రీకాంత్ రెడ్డి, డీఆర్‌డీఓ జాన్సన్, బీసీ సంక్షేమ అధికారి పుష్పలత, ఎస్సీ కార్పొరేషన్ ఇడి బాబు మోసెస్, ఎస్టీ సంక్షేమ కార్పొరేషన్ అధికారి కోటాజీ పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories