ఆదివాసీల నిర్బంధంపై హైకోర్టులో పిటిషన్..కాసేపట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు..

ఆదివాసీల నిర్బంధంపై హైకోర్టులో పిటిషన్..కాసేపట్లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు..
x
Highlights

కొమరంబీమ్ జిల్లా రేపల్లెలో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్బంధించడంపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. గత నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసులను అక్రమంగా...

కొమరంబీమ్ జిల్లా రేపల్లెలో ఉన్న ఆదివాసులను అక్రమంగా నిర్బంధించడంపై తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. గత నాలుగు రోజులుగా 67 మంది ఆదివాసులను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నారని పౌరహక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణకు స్వీకరించారు. మరో వైపు బలవంతంగా ఎవరినీ బంధించలేదని వాళ్ల ఇష్టపూర్వకంగానే వచ్చి పారెస్ట్ డిపోలో ఉంటున్నారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించని హైకోర్టు ఆదివాసులను కోర్టు ముందు ఉంచితే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయని పిటిషనర్ తెలిపారు. ఆదివాసీలను హైదరాబాద్ తీసుకురావాలని హైకోర్టు ఆదేశించడంతో ఏసీబస్సుల్లో తీసుకు వచ్చారు. కాసేపట్లో హైకోర్ట్ చీఫ్ జస్టిస్ విచారణ జరుపనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories