చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్..

చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్..
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

మాంసాహారుల్లో చాలా మంది ఇష్టపడేది చికెన్నే. ఆదివారం వచ్చినా లేదా ఇంటికి బంధువులు వచ్చినా చికెన్ లేనిది ఆరోజు గడవదు. కానీ కొద్ది రోజుల క్రితం చికెన్...

మాంసాహారుల్లో చాలా మంది ఇష్టపడేది చికెన్నే. ఆదివారం వచ్చినా లేదా ఇంటికి బంధువులు వచ్చినా చికెన్ లేనిది ఆరోజు గడవదు. కానీ కొద్ది రోజుల క్రితం చికెన్ ధరలు పెరిగిపోవడంతో కిలో తీసుకునే వారు పావుకిలో కూర తీసుకుని సరిపెట్టుకున్నారు. కానీ మళ్లీ చికెన్ ధరలు తగ్గు ముఖం పడుతున్నాయి. దీంతో మాంసాహార ప్రియులకు ఒక ఊరట లభించింది.

రాష్ట్రంలో చిలితీవ్రత పెరుగుతుండడంతో కోళ్లు చలికి తట్టుకోలేక చనిపోతాయి. దీంతో చికెన్ సెంటర్ యజమానులు ధరలను తగ్గించేస్తున్నారు. అంతే కాక చాలా మంది స్వామి మాలలు వేసుకోవడంతో చికెన్ ను కొనుగోలు చేసేవారు తగ్గిపోయారు. ఇక చికెన్ ధరలు ఎక్కువ ఉండడంతో చికెన్ ప్రియులు దాని వంకకూడా చూడడంలేదు. ఈ అన్ని పరిస్థితులను గమనించిన చికెన్ సెంటర్ యజమానులు ధరలు తగ్గించారు.

నిన్నమొన్నటి వరకూ రూ.220 గా ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.150 నుంచి రూ.180వరకు ధర పలుకుతోంది. ఇక లైవ్‌ చికెన్ ధర కేవలం రూ.82–92 మధ్య మాత్రమే ఉంది. దీంతో చాలా మంది చికెన్ ప్రియులు చికెన్ ను కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. చికెన్ అమ్మకం కొంత మేరకు పెరగడంతో వ్యాపారులు సంతృప్తి చెందుతున్నారు. రానున్నరోజుల్లో ఈ చికెన్ ధరలు ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories