తెలంగాణ లో 61లక్షల కేసుల బీరు తాగేశారు!

తెలంగాణ లో 61లక్షల కేసుల బీరు తాగేశారు!
x
Highlights

ఈ సంవత్సరం భానుడు తన ప్రతాపాన్ని భారీగా చూపించాడు. నిప్పులు కురిపించి ప్రజలను ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ వేసవి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు...

ఈ సంవత్సరం భానుడు తన ప్రతాపాన్ని భారీగా చూపించాడు. నిప్పులు కురిపించి ప్రజలను ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేసింది ఈ వేసవి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల అదే పరిస్థితి. ఉక్కబోత..దాహం జనం తట్టుకోలేకపోయారు. మరి మండుబబులకేమో రోజు మందు పడాల్సిందే. అసలే ఎండ వేడి చంపేస్తుంటే.. మందు తాగే పరిస్థితి ఉండదు. అందుకే బీర్ల మీద పడ్డారందరూ. ఎన్నడూ లేనంతగా బీర్లను పీల్చేశారు.

తెలంగాణ రాష్ట్ర బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ లెక్కల ప్రకారం మే నెలలో 61 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయట. ఈ స్థాయిలో బీర్ల అమ్మకాలు ఇదే మొదటిసారని అధికారులు అంటున్నారు. ఏప్రిల్ నెలలో 53 లక్షల కేసులు అమ్మితే.. మే నెలలో అది 61 కి చేరింది. అసలు 53 లక్షల కేసులే రికార్డు అనుకుంటే.. దానిని మించిపోయింది మే నెల అమ్మకం. ఎండలు బీర్ల సరఫరాపైనా ప్రభావం చూపాయి. నీళ్లు లేకపోవడంతో ప్రొడక్షన్ తగ్గింది. డిమాండ్ కు తగ్గట్టుగా సప్లయ్ చేయలేకపోయారు. మెదక్ లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బీర్ల తయారీకి ఇబ్బందులు తలెత్తాయని బీర్ల తయారీ కంపెనీలు చెప్పాయి. తీవ్రమైన నీటి సమస్య ఉండటంతో.. బీర్ల తయారీ కంపెనీలకు నీటి సరఫరా నిలిపివేయాలని జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు ఇచ్చారు. దీంతో 30శాతం వరకు నీటి సరఫరా తగ్గిపోయింది. ప్రీమియం రేంజ్ బీర్లకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కొన్ని పాపులర్ బ్రాండ్స్ బీర్ల విషయంలో మాత్రం కొరత ఏర్పడిందని అధికారులు చెప్పారు. బీర్ల కొరత అనేది వేసవి సీజన్ లో కామన్ అని అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితి తెలంగాణలో మాత్రమే కాదు.. దేశం మొత్తం ఉంటుందన్నారు. సేల్స్ పెరగడం పట్ల బీరు తయారీ కంపెనీలు ఆనందంగా ఉన్నాయి. ఇటు ప్రభుత్వానికి కూడా ఈస్థాయి అమ్మకాలతో భారీగానే ఆదాయం సమకూరిందంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories