GST: జీఎస్టీ వసూళ్ళలో తెలంగాణా రికార్డ్!

GST: జీఎస్టీ  వసూళ్ళలో తెలంగాణా రికార్డ్!
x
Highlights

తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలోనే కాదు జీఎస్టీ పన్నుల వసూళ్లలోనూ ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి. కేంద్రం జీఎస్టీని ప్రవేపెట్టిన నాటినుంచి దేశ వ్యాప్తంగా వసూళ్లు ఏవిధంగా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం మాత్రం మిగతా దక్షిణాది రాష్ట్రాల కన్నా కూడా ముందు వరుసలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలోనే కాదు జీఎస్టీ పన్నుల వసూళ్లలోనూ ముందంజలోనే ఉందని చెప్పుకోవాలి. కేంద్రం జీఎస్టీని ప్రవేపెట్టిన నాటినుంచి దేశ వ్యాప్తంగా వసూళ్లు ఏవిధంగా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం మాత్రం మిగతా దక్షిణాది రాష్ట్రాల కన్నా కూడా ముందు వరుసలో నిలిచింది. 2019-20 వార్షిక బడ్జెట్లో వాణిజ్య పన్నులు, జీఎస్టీ ద్వారా రూ.47వేల కోట్లు రాబడి వస్తుందని అంచనా వేయగా, ఈసారి ఈ అంచనాలను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృద్దిరేటు తగ్గినప్పటికీ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల వలన జీఎస్టీని సక్రమంగా వసూళ్లు చేయడంతో లక్ష్యాన్ని మించి ఖజానాకు రాబడి వస్తోంది. ఈ ఖజానా గతేడాది కంటే కూడా ఈ ఏడాది వసూళ్లలో ఇంకా ముందంజలో ఉంది. అంతే కాదు ప్రత్యేక యాప్, స్పెషల్ డ్రైవ్‌లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోంది.

ఇక పోతే గతేడాది 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.45,379 కోట్ల రాబడి రావడంతో 15.37% వృద్ధిరేటును రాష్ట్రంలో నమోదు చేసుకోగా. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి రూ.48 వేల కోట్ల నుంచి రూ.50 వేలకోట్ల రాబడి లక్ష్యంతో ముందుకు సాగుతుంది. కాగా ఈ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే రూ.40,268 కోట్లు వసూలు కాగా 6.35 శాతం వృద్ధి రేటు నమోదయింది. బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఇది 86 శాతం. ఇక పోతే ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో నెలరోజు మాత్రమే ఉండడంతో వసూళ్లను సరైన క్రమంలో చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బకాయిలతో పాటు పన్నుల రూపంలో రూ.8,000 కోట్ల నుండి రూ.10,000 కోట్ల వరకు వసూలు అవుతాయని అంచనా. ఈ సమయంలో పన్నుల వసూలు మాత్రమే కాకుండా ఎగవేతలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories