ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి

ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం పూర్తి
x
రీ పోస్టుమార్టం
Highlights

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తియ్యింది. సుమారు 8 గంటలు పాటు రీపోస్టుమార్టం సాగింది. మృతదేహం నుంచి డీఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్స్...

ఆయేషా మీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తియ్యింది. సుమారు 8 గంటలు పాటు రీపోస్టుమార్టం సాగింది. మృతదేహం నుంచి డీఎన్ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ సేకరించారు. సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య పర్యవేక్షణలో ఫోరెన్సిక్‌ నిపుణులు ఆనవాళ్లను నమోదు చేసుకున్నారు. ఎముకలు, వెంట్రకలు, గోళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఫోరెన్సిక్‌ బృందం నివేదికను తయారు చేయనుంది. ఆయేషా మీరా మృతదేహంలో కీలకంగా భావిస్తున్న స్కల్స్ , బోన్స్ సేకరించారు. వాటిని ప్రత్యేక బాక్సులో సీల్డ్ వేసి భద్ర పరిచారు. రీ పోస్టుమార్టంకు సంబంధించిన వివరాలు చెప్పడానికి సీబీఐ అధికారులు నిరాకరించారు.

ఆయేషా మీరా రీ పోస్టుమార్టం పూర్తయింది. సీబీఐ అధికారులు డీఎన్‌ఏ టెస్ట్‌ కోసం స్కల్ , బోన్స్ తీసుకెళ్లారని తెనాలి ఎమ్మార్వో రవి బాబు తెలిపారు. సీబీఐతో పాటు ఫోరెన్సిక్ అధికారులు రీ పోస్టుమార్టంలో పాల్గొన్నారని చెప్పారు. రీ పోస్టుమార్టంతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆయేషా మీరా తండ్రి పేర్కొన్నారు. పెద్దవారు వెనుకాల ఉన్నందునే తన కూతురు మరణానికి న్యాయం జరగలేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories