రెండు గర్భసంచులున్న మహిళకు శస్త్రచికిత్స..

రెండు గర్భసంచులున్న మహిళకు శస్త్రచికిత్స..
x
Highlights

వైద్య చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు సృష్టిస్తుంటారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే రెండు గర్భసంచులు ఉన్న ఓ నిండు గర్భినికి అరుదైన శస్త్రచికిత్స చేసి తల్లిబిడ్డ ప్రాణం కాపాడారు.

వైద్య చరిత్రలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు సృష్టిస్తుంటారు వైద్యులు. ఈ నేపథ్యంలోనే రెండు గర్భసంచులు ఉన్న ఓ నిండు గర్భినికి అరుదైన శస్త్రచికిత్స చేసి తల్లిబిడ్డ ప్రాణం కాపాడారు.అసలు ప్రతి మహిళకు ఒక గర్భసంచి ఉండడం సాధారణమైన విషయం అయినప్పటికి ఈ మహిళకు మాత్రం రెండు గర్భసంచులు ఉండడం అరుదైన విషయం.

పూర్తివివరాళ్లోకెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా మొగచింతలకు చెందిన ఏడుకొండలు-జయమ్మ దంపతులు పొట్టకూటి కోసం కొంతకాలంక్రితం వారి గ్రామాన్ని వదిలేసొచ్చి కరీంనగర్‌ జిల్లాలోని జమ్మికుంటలో తాపీ పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. వీరి కుమార్తె అనూష గర్భవతి కావడంతో ఆమెను వారి వద్దకు తీసుకుని వచ్చారు. కాగా ఆమెకు ప్రతి నెలా ఓ హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయిస్తున్నారు.

నెలలు గడిచి గర్భిణిక ప్రసవ సమయం దగ్గరికొచ్చింది. దీంతో ఆమెను వెంటను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని తెలిపారు. అందుకోసం రూ.2 లక్షలకుపైగా ఖర్చవుతుందని వైద్యులు వెల్లడించారు. దీంతో తిక్కుతోచని పరిస్థితిలో అనూష తల్లిదండ్రులు వారి సొంత గ్రామానికి వెల్లాలనుకున్నారు.

అందుకోసం అనుమతి ఇవ్వాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటలరాజేందర్ ను ఫోన్ ద్వారా కోరారు. విషయం పూర్తిగా విన్న మంత్రి హుజూరాబాద్‌ ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వీ ప్రవీణ్‌రెడ్డిని ఆ గర్భినిన ఆదుకోవాలని ఆదేశించారు. దీంతో స్పందించిన వైద్యుడు లాప్కోస్కోపిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు గంటలకు పైగా శ్రమించి శస్త్ర చికిత్స చేసారు.

కడుపులో పగిలిన గర్భసంచి తొలగించి, శిశువును క్షేమంగా బయటకు తీశారు. దీంతో తల్లిబిడ్డా ఇద్దరూ సురక్షితంగా ప్రాణాలతో ఉన్నారు. అయితే కొన్ని జన్యు లోపాల కారణంగా ఇలా వేయి మందిలో ఒకరికి రెండు గర్భసంచులు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories