తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే..

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే..
x
Highlights

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మర్కజ్ యాత్రికులతో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాంటాక్ట్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ...

తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. మర్కజ్ యాత్రికులతో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాంటాక్ట్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యం లో సర్కార్ మరో అడుగు ముందుకు వేసింది. కరోనా పాజిటివ్ కేసులున్న వారి ఇంటి చుట్టుప్రక్కల కిలోమీటర్ పరిధి వరకు వైద్య బృందాలతో కలిసి ఇంటింటికీ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేయనున్నారు.

ఈ సర్వే ఆధారంగా జలుబు, జ్వరం, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానాలుంటే వారి రక్త నమూనాలను తీసుకుని పరీక్షలకు పంపించి ఎవరికైన పాజిటివ్ ఉన్నదా లేదా అన్నది తెలుసుకుంటారు. ఇలా ఒకే ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నట్లయితే ఆప్రాంతంలోని వారు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా - ఇతరప్రాంతాల వారు ఆ ప్రాంతంలోకి రాకుండా పోలీసులు నిర్వహించే కార్డన్ ఆఫ్ వంటివి చేపట్టాల‌ని తెలంగాణా ప్ర‌భుత్వం ఆలోచిస్తోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories