శంషాబాద్‌ విమానాశ్రయం మూసివేత...

శంషాబాద్‌ విమానాశ్రయం మూసివేత...
x
Rajiv Gandhi International Airport (File Photo)
Highlights

శంలో కరొనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడంతో కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది.

ప్రతి నిత్యం జాతీయ, అంతర్జాతీయ ప్రయాణికులతొ, విమానాల రాకపోకలతో కళకళలాడుతుండే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వెల వెల బోతోంది. విద్యుత్తు దీపాల్లో మిరుమిట్లు గొలుపుతూ ఉండే ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో విమాన సర్వీసులు రద్దులు కావడంతో చీకట్లు అలుముకున్నాయి. దేశంలో కరొనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడంతో కేంద్రం దేశ వ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించింది.

దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి విమాన సర్వీసులన్నీ నిలిచిపోయి విమానాశ్రయాన్ని మూసివేశారు. దీంతో విదేశాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఎవరూ నగరానికి చేరుకోకుండా అయిపోయింది. కానీ అత్యవసర వస్తువులను, సరకులను రవాణా చేసే విమానాలకు మాత్రమే విమానాశ్రయంలో అనుమతి ఉంది. ఇక పోతే ఎయిర్ పోర్టు వాహన పార్కింగ్ ప్రాంతం, డిపాశ్చర్, అరైవల్ టెర్మినళ్లు పూర్తిగా మూతపడ్డాయి.

లైట్లన్నింటినీ ఆపేయడంతో ఎయిర్ పోర్టు ప్రాంతమంతా పూర్తిగా చీకటి వాతావరణం నెలకొంది. 2008లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదు. ఇలా వేరే దేశం నుంచి ఏదో వైరస్ వ్యాపించి నిత్యం రద్దీగా ఉండే విమానాశ్రమంలో సర్వీసులన్నీ నిలిపివేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అంతకుముందు బేగంపేట విమానాశ్రయానికి కూడా ప్రస్తుత గడ్డు పరిస్థితి ఎన్నడూ ఎదురుకాలేదు. రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు గాను ఈ నెల 22వ తేది నుంచి కేంద్రం తీసుకున్న ముందస్తు చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను కేంద్రం పూర్తిగా రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్దరాత్రి నుంచి పూర్తిగా దేశీయ విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories