ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల వర్షాలు..

ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల వర్షాలు..
x
Highlights

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో చింతలమానేపల్లి మండలంలో రెండు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది....

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో చింతలమానేపల్లి మండలంలో రెండు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో ముసురు అలుముకుంది. రెండు రోజులుగా తేలికపాటి వర్షాలతో తడిసిముద్దైంది. ఏకధాటిగా చిరుజల్లులు కురుస్తుండటంతో.. పంటలకు ఊపిరి పోసినట్లైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో జిల్లాలో సుమారు 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనూ నాన్‌స్టాప్‌గా వర్షం కురుస్తోంది. మంగపేట మండలం మొట్లగూడెం సమీపంలో మల్లూర్ వాగు ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. నరసింహాసాగర్, పూరేడుపల్లి, నరేంద్ర రావుపేట, శనగకుంట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories