Top
logo

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం
X
Highlights

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌,...

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం ప్రారంభమైంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, తిరుమలగిరి, జేబీఎస్‌, కార్కానా, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.

మరోవైపు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తూర్పు మధ్యప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.



Web TitleRain lashes in Hyderabad
Next Story