చిన్న గొడవే..షాక్ లో వున్నా: రాహుల్ సిప్లిగంజ్

చిన్న గొడవే..షాక్ లో వున్నా: రాహుల్ సిప్లిగంజ్
x
రాహుల్ సిప్లిగంజ్
Highlights

సింగర్, బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలో ఉన్న ప్రీజమ్ పబ్ లో బీరు సీసాలతో దాడి జరిగింది. దాంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు....

సింగర్, బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై గచ్చిబౌలిలో ఉన్న ప్రీజమ్ పబ్ లో బీరు సీసాలతో దాడి జరిగింది. దాంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనలో గాయపడిన రాహుల్ ను వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం రాహుల్ ఇంటికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంధువు రితేష్ రెడ్డి దాడి చేసినట్టు గుర్తించారు. చిన్న విషయంలో మాటమాట పెరిగి ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది.

పబ్ లో గొడవపై రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. తనపై ఓ యువకుడు బీరు బాటిల్ తో దాడి చేశాడని, తలకు చిన్న గాయం మాత్రమే అయ్యిందని వివరించాడు. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని మిగిలిన వివరాలు త్వరలో తెలియజేస్తా అన్నారు రాహుల్. పోలీసులకు అన్ని వివరాలను తెలియజేయడానికి స్టేషన్‌కి వెళ్తానన్నారు రాహుల్. అయితే దాడి జరిగిన తరువాత పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదన్నది తేలాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories