పదిమంది కలిసి కొట్టారు.. కాంప్రమైజ్ కాను‌: రాహుల్ సిప్లిగంజ్‌

పదిమంది కలిసి కొట్టారు.. కాంప్రమైజ్ కాను‌: రాహుల్ సిప్లిగంజ్‌
x
పదిమంది కలిసి కొట్టారు.. కాంప్రమైజ్ కాను‌: రాహుల్ సిప్లిగంజ్‌
Highlights

అర్థరాత్రి హైదరాబాద్‌‌లో పబ్ గొడవ జరిగింది. సింగర్ బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై గచ్చిబౌలిలో ఉన్న ప్రీజమ్ పబ్ లో బీరు సీసాలతో దాడి చేశారు....

అర్థరాత్రి హైదరాబాద్‌‌లో పబ్ గొడవ జరిగింది. సింగర్ బిగ్ బాస్ -3 విజేత రాహుల్ సిప్లిగంజ్‌పై గచ్చిబౌలిలో ఉన్న ప్రీజమ్ పబ్ లో బీరు సీసాలతో దాడి చేశారు. దాంతో రాహుల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన రాహుల్ ను వెంటనే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సరైనా సమయంలో పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది.పబ్ లో రాహుల్ పై దాడి చేసింది ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి బంధువులుగా అనుమానిస్తున్నారు. పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పబ్‌లో తనపై అకారణంగా రితేష్ రెడ్డితో పాటు పది మంది దాడి చేశారని రాహుల్ సిప్లిగంజ్‌ తెలిపారు. కాసేపటి క్రితమే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రాహుల్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులపై కంప్లైంట్ ఇచ్చాడు. తనతో ఉన్న యువతుల పట్ల వాళ్లు అసభ్యంగా ప్రవర్తించారని, ఇదేంటని అడిగితే.. తనపై బీర్ బాటిళ్లతో దాడికి పాల్పడ్డారని ఆరోపించాడు. రాజకీయ పలుబడి ఉందన్న గర్వంతో తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై అకారణంగా దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వారిప్పుడు తనతో రాజీకి ప్రయత్నించినా కాంప్రమైజ్ కానని స్పష్టం చేశారు. తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం జరుగుతుందని తనకు నమ్మకం ఉందని, పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తాను ఒక్కడినే ఉన్నానని, వాళ్లు పది మంది కలిసి వచ్చి దాడి చేశారని చెప్పాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories