Top
logo

ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ

ఇవాళ తెలంగాణకు రాహుల్ గాంధీ
X
Highlights

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో...

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.15 గంటలకు శంషాబాద్‌ చేరుకోనున్న రాహుల్‌కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆర్‌సీ ఖుంటియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్వాగతం పలకనున్నారు.

అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాహుల్‌ శంషాబాద్‌ సమీపంలోని క్లాసిక్‌ కన్వెన్షన్‌ మైదానంలో నిర్వహించనున్న కనీస ఆదాయ వాగ్దాన సభాస్థలికి చేరుకుంటారు. కాగా సభ అనంతరం ఓ హోటల్ లో పార్టీ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సుమారు గంట సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది.

Next Story