logo

టీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు ఓటమి

టీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థులు ఓటమి

కరీంనగర్‌–ఆదిలాబాద్‌–నిజామాబాద్‌–మెదక్, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ జిల్లాల ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. కూర రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి ఎమ్మెల్సీలుగా విజయం సాధించారు. ఇక కరీంనగర్‌–ఆదిలాబాద్‌– నిజామాబాద్‌–మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి వెనకబడి ఉన్నారు.

ఈ స్థానంలో మాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి విజయం సాధించే దిశగా వెళుతున్నారు. పోలైన మొత్తం ఓట్లలో రెండు రౌండ్లు ముగిసే సరికి జీవన్‌రెడ్డి భారీ మెజారిటీ సాధించారు. అనధికారిక సమాచారం మేరకు జీవం రెడ్డి కూడా విజయం సాధించినట్టు తెలుస్తోంది.

లైవ్ టీవి

Share it
Top