పగలు రెక్కీలు.. రాత్రి చోరీలు

పగలు రెక్కీలు.. రాత్రి చోరీలు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

పగలంతా రెక్కీ నిర్వహిస్తారు... రాత్రంతా చోరీలు చేస్తారు. వీళ్ళు స్కెచ్‌ వేశారంటే ఆ ఇళ్ళు ఖాళీ కావాల్సిందే. ఎవరైన ఎదిరిస్తే తుపాకులతో, కత్తులతో బెదిరిస్తారు.

పగలంతా రెక్కీ నిర్వహిస్తారు... రాత్రంతా చోరీలు చేస్తారు. వీళ్ళు స్కెచ్‌ వేశారంటే ఆ ఇళ్ళు ఖాళీ కావాల్సిందే. ఎవరైన ఎదిరిస్తే తుపాకులతో, కత్తులతో బెదిరిస్తారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న రెండు చోరీ ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నెల మీర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులకు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రశ్నించారు. తాము టాస్క్‌ఫోర్స్ పోలీసులమని డ్యూటీలో ఉన్నామని చెప్పడంతో అనుమానం వచ్చి ఐడీ అడగగా కానిస్టేబుల్‌పై పై పెప్పర్ స్ప్రే కొట్టి పరారయ్యాడు. మరో కానిస్టేబుల్ ఇంకో వ్యక్తిని చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన మీర్‌పేట్ పోలీసులు ఎల్బీనగర్ సీసీఎస్ పోలీసులతో కలిసి ముఠాలోని ప్రధాన నిందితునితో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

తమిళనాడుకు చెందిన వర్ధన్ మణికందన్... అలియాస్ గణేష్ ముఠా నాయకుడని పోలీసులు గుర్తించారు. వీరిపై 27 పోలీస్టేషన్లలో కేసులు ఉన్నట్లుగా గుర్తించారు. వీరి నుంచి 47.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి సామాగ్రి, ఒక ఎయిర్ పిస్టల్, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు

గత నెల 31న యాప్రాల్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరి కేసును కూడా పోలీసులు ఛేదించారు. దానం నర్సింగరావు ఇంటికి తాళం వేసి కుటుంబం సహా యాదగిరిగుట్టకు వెళ్ళి వచ్చే సరికి ఇల్లు గుల్ల చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు వేలి ముద్రల ఆధారంగా నిందితులను గుర్తించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories