రాజధాని రోడ్లుకు ఎందుకింత కష్టమొచ్చింది.?

రాజధాని రోడ్లుకు ఎందుకింత కష్టమొచ్చింది.?
x
Highlights

రాజధాని రోడ్లుకు ఎందుకింత కష్టమొచ్చింది.? ఇవేం రోడ్లురా బాబూ అంటూ సామాన్య ప్రజలు గగ్గోలు పెట్టే రోజులెందుకొచ్చాయ్‌.? ఎందుకిలా విలవిల్లాడాల్సిన...

రాజధాని రోడ్లుకు ఎందుకింత కష్టమొచ్చింది.? ఇవేం రోడ్లురా బాబూ అంటూ సామాన్య ప్రజలు గగ్గోలు పెట్టే రోజులెందుకొచ్చాయ్‌.? ఎందుకిలా విలవిల్లాడాల్సిన పరిస్థితి దారిపిస్తోంది.? మానవ తప్పిదాలకు ప్రకృతిని ఎన్నాళ్లనీ నిందిద్దామన్న మాట వచ్చింది? హైదరాబాద్‌లో నరకానికి రహదారులుగా రోడ్లను ఎందుకు భావించాల్సి వస్తోంది.?

ఒక్కచోట కాదు... అక్కడా ఇక్కడ అన్న తేడా లేదు. ఎక్కడైనా ఇదే పరిస్థితి. నడీ రోడ్డుపై నడ్డి విరిగే దుస్థితి. వెహికిల్‌ నట్లే కాదు బాడీ నట్లు కూడా ఊడిపోయేలా నరకానికి రహదారుల్లా మారాయి మన రహదారులు. హైదరాబాద్ అంతటా సర్కస్‌ ఫీట్లు చేయాల్సి రావడం దారుణమైతే ప్రమాదాల బారిన పడుతూ ప్రాణాలు కోల్పోవడం, గాయాల పాలవడమే ఘోరం. ఎన్నాళ్లు... ఇంకెన్నాళ్లు ఒకరి మీద ఒకరు ఆడిపోసుకుంటారు. ప్రజలను ఇబ్బందులు పెడతారు.

హైదరాబాద్‌ అంతటా రోడ్లు ఛిద్రమయ్యే కనిపిస్తాయి. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. మోకాలు లోతు గుంతలు తేలిన రోడ్లపై ప్రయాణించాలంటానే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. కంకరతేలిన రోడ్లపై వెళ్తూ ప్రమాదాలకు గురువుతున్నారు. ప్రధాన రహదారులు కూడా పెద్దపెద్ద గుంతలతో డొంకరోడ్లను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ రోడ్ల దుస్థితి ఇంత అధ్వానంగా లేదని ప్రజలు చెబుతున్నారు. రోడ్లు మొత్తం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడున్న రోడ్ల దుస్థితిని చూస్తే బాగుచేయడం అసలు మన తరం అవుతుందా? అన్న అనుమానం వస్తోంది సగటు పౌరుడికి.

ఇవేం రోడ్లు.. ఇవేం పనులు.. అసలు ఏం చేస్తున్నారు..? కాంట్రాక్టర్ ఎక్కడున్నాడు..? ఈ మాట అడిగే నాథుడు లేడు. రోడ్లపై ప్రయాణం అంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఏ రోడ్డుపై ఏ క్షణం చివరిది అవుతుందోనని హడలిపోతున్నారు. రోడ్లుకావివి నరకానికి నకళ్లు అంటూ గగ్గోలు పెడుతున్నారు. గ్రేటర్‌ సిటీలో 9వేల 50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయ్‌ రోడ్లు. వీటిలో 4వేల 173కిలోమీటర్లు బీటీరోడ్లు ఉండగా... 3వేల928 కిలోమీటర్ల సిమెంటురోడ్లు ఉన్నాయి. కంకర రోడ్లు 81కిలోమీటర్లు, 857 కిలోమీటర్ల మేర మట్టిరోడ్లుకూడా రాజధాని పరిధిలో ఉన్నాయి. వీటన్నిటినీ జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్నా... ప్రయాణం ప్రాణసంకటంగా మారిందంటున్నారు ప్రజలు.

ఒకసారి బీటీ రోడ్డు వేస్తే ఐదేళ్లు లైఫ్‌ టైమ్‌ ఉంటుంది. అదే సిమెంట్‌ రోడ్డు అయితే 30ఏళ్ల లైఫ్‌ టైం ఉంటుంది. ఒకవేళ రెండేళ్లలోపే రోడ్డు పాడైతే.. కాంట్రాక్టర్‌ దాన్ని సరిచేయాలి. లేదా కార్పొరేషన్‌ డిఫెక్ట్‌ లయబిలిటీ ఒప్పందంలో ఉన్న నిధుల నుంచి మున్సిపల్‌ శాఖే రోడ్లను రిపేరు చేయాలి. రోడ్ల రిపేరు కోసం ఏటా బడ్జెట్‌లో కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తోంది సర్కార్‌. గుంతలను పూడ్చడం.. ప్యాచ్‌ వర్క్‌లతోనే నిధులన్నీ ఖర్చు పెట్టేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదీలాగే కొనసాగితే హైదరాబాద్‌ అంటేనే అతుకుల రోడ్లు అని చెప్పుకోవల్సి వస్తుందంటున్నారు ప్రజలు. గతుకుల రోడ్లు మనల్ని, మన అభివృద్ధిని ఎటువైపు తతీసుకెళ్లుతున్నాయో ఆలోచించుకోవాల్సి ఉందంటున్నారు రాజధానివాసులు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories