మెకానిక్ నుంచి సైకో కిల్లర్ గా.. అఘాయిత్యాలకి కేరాఫ్ అడ్రెస్ గా

మెకానిక్ నుంచి సైకో కిల్లర్ గా.. అఘాయిత్యాలకి కేరాఫ్ అడ్రెస్ గా
x
Highlights

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై మరి కొద్ది సేపట్లో (సోమవారం) తుది తీర్పు రానుంది.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యలపై మరి కొద్ది సేపట్లో ( సోమవారం )తుది తీర్పు రానుంది. హాజీపూర్‌లో బాలికలు దారుణంగా అత్యాచారం, హత్యలపై నల్గొండలోని ప్రత్యేక ఫోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే ఇప్పటికి వరకు ఈ కేసులో ఎం జరిగింది అన్నది ఒకసారి తెలుసుకుందాం..

మైనర్ బాలికలు కల్పన (11), మనీషా (17), శ్రావణి (14) లను అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేసి అనంతరం తన బావిలో పడేసి ఏమి తెలయదు అన్నట్టుగా ప్రవర్తిస్తూ వచ్చాడు సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి. కానీ శ్రావణి కేసులో ప్రధాన నిందితుడు అని తెలియడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించగా అతని నేరప్రవర్తన ఒక్కొక్కటిగా మొత్తం బయటకు వచ్చాయి.

ఆసలు సైకోగా ఎందుకు మారాడు ?

లిఫ్ట్ మెకానిక్ గా కేరియర్ మొదలు పెట్టిన మర్రి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణాలోని నిజామాబాద్ , ఆదిలాబాద్ ,వేములవాడలోని ప్రాంతాల్లో పనిచేసాడు . అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేసాడు. జరిగిన మూడు హత్యలు మాత్రమే కాకుండా కర్నూల్ జిల్లాలో స్నేహితులతో తెచ్చుకున్న చెందిన ఓ మహిళను డబ్బుల విషయంలో మాట మాట రావడంతో ఐరన్ రాడ్ తో కొట్టి చంపేసి పెంట్‌ హౌస్‌పై ఉన్న వాడుకలో లేని నీటి ట్యాంకులో పడేసి మూతపెట్టి పరారయ్యాడు. ఈ కేసు శ్రావణి కేసులో భాగంగా బయటకు వచ్చింది

అంతేకాకుండా పశువులను కాస్తున్న ఓ మహిళ (38)ను రేప్ చెయ్యబోయబోగా, ఆమె కేకలు వెయ్యడంతో ప్రజలు శ్రీనివాస రెడ్డిపై దాడి చేశారు. అనంతరం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాధిత మహిళ కుటుంబ సభ్యులతో రాజీ కుదుర్చుకోవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు. కానీ జరిగిన అవమానాన్ని మాత్రం లోపలే ఉంచుకున్నాడు. ఏ రేప్ కేసులో తాను ఇరుక్కున్నాడో, అదే రేప్‌లు చేసి పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. అందులో భాగంగానే కల్పన, మనిషా, శ్రావణిలను చంపేసి తన 60 అడుగుల బావిలో పడేశాడు.

14 రోజుల రిమాండ్ ..

ఇక శ్రావణి కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డి అనే తేలడంతో పోలీసులు అరెస్ట్ చేసి విచారణ మొదలు పెట్టారు. ఇక విచారణ అనంతరం పోలీసులు శ్రీనివాస్‌‌‌రెడ్డిని భువనగిరి కోర్టులో హాజరుపర్చారు. నిందితుడు శ్రీనివాస్‌‌రెడ్డికి న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించడంతో శ్రీనివాస్‌ రెడ్డిని కట్టుదిట్టమైన భద్రత నడుమ వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. నిందుతుడు మర్రి శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష వేయాలని అక్కడి గ్రామా ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేశారు.

తుది తీర్పు నేడు..

ఇక అక్టోబర్ 14 నుంచి హాజీపూర్ కేసులపై విచారణ జరుగుతూ వచ్చింది. ఈ కేసులో మొత్తం 101 మంది సాక్షులను విచారించిన కోర్టు నిందితుడిని కోర్టు ఎగ్జామిన్ చేసింది. అత్యాచారం, హత్యలపై ఇరు పక్షాల న్యాయవాదులు జడ్జీ ముందు వాదనలు వినిపించారు. జనవరి 17న తుది వాదనలు ముగిశాయి.. ఈరోజు దీనిపైన తుది తీర్పు రానుంది. నిందితుడికి ఉరే సరని హాజీపూర్ గ్రామస్తులంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories