డ్రోన్ ల ద్వారా మందులు ఇంటికే..

డ్రోన్ ల ద్వారా మందులు ఇంటికే..
x
Highlights

మన దేశంలో డ్రోన్ల ద్వారా వైద్య సేవలను అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవనుంది.

మన దేశంలో డ్రోన్ల ద్వారా వైద్య సేవలను అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవనుంది. రాష్ట్రంలో అభివృద్ది చెందని నగరాలతో పాగు ఇప్పటి వరకూ అభివృద్ది చెందని ఎన్నో మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాల్లో రోడ్లు, రవాణా సౌకర్యం లేదు. దీంతో వారికి అనారోగ్యం సంభవించినా, రోడ్డు ప్రమాదాలు, గర్భిణిలు, పాము కాటు, గుండెపోటు వంటి వాటికి గురైనా వారు వర్షా కాలంలో, రాత్రి సమయాల్లో ఆ ప్రాంత ప్రజలకు ఆస్పత్రులకువెళ్లటం కష్టం. ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాలు రాష్ట్రంలోని ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌ జిల్లాల్లో ఉన్నాయి.

ఇలాంటి వారికి అత్యవసర్ మందులను పంపీణీ చేయడానికి ప్రభుత్వం మరో ప్రయత్నం చేస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేయనున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యులు మారుమూల ప్రాంతాలకు వెళ్లటం కష్టం కాబట్టి ఇక్కడి ప్రజలకు డ్రోన్ల ద్వారా వైద్య సేవలు అందించనున్నారు. అత్యాధునిక డ్రోన్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ మారుట్‌ డ్రోన్స్, అపోలో ఆస్పత్రుల మధ్య ఒప్పందం కుదిరింది.

ఇందులో భాగంగానే బేగంపేటలో నిర్వహిస్తున్న వింగ్స్‌ ఇండియా–2020 కార్యక్రమంలో మెడికల్‌ డ్రోన్‌ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మారుట్‌ డ్రోన్స్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ వీ ప్రేమ్‌ కుమార్‌ మట్లాడుతూ మెడికల్‌ డ్రోన్‌ ఎలా పని చేస్తుందో అన్ని వివరాలను ఆయన వెల్లడించారు. డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు, రక్తం, వ్యాక్సిన్స్, డయాగ్నస్టిక్‌ శాంపిల్స్, దీర్ఘకాలిక ఔషధాలను సరఫరా చేస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 8 నిమిషాల్లో 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని స్పష్టం చేసారు.

ఆర్డర్‌ రాగానే డ్రోన్స్‌లో సంబంధిత సిబ్బంది మందులను అమర్చితే డ్రోన్లు టేకాఫ్‌ అవుతాయని వెల్లడి చేసారు. నిత్యం ప్రజలు ప్రయాణించే ఓలా, ఊబర్లు ఏవిధంగానైతే గూగుల్ మ్యాప్ సాయంతో గమ్యాన్ని చేరుతాయో, డ్రోన్ లు కూడా అదే పద్దతిని పాటిస్తాయని తెలిపారు. అంతే కాదు మందులు సరైన వ్యక్తికే చేరాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి మందులను బుక్‌ చేయగానే వచ్చిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలని తెలిపారు. దాని ద్వారా మందులు ఎంత దూరం ఉన్నాయి అన్న డిస్టెన్స్ ని కూడా చూడొచ్చాన్నారు. ఇందుకు గాను దాదాపుగా కోటి రూపాయలవరకు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories