మెట్రోకు ఆదరణ పెరిగినా సమస్యలు అలానే!

మెట్రోకు  ఆదరణ పెరిగినా సమస్యలు అలానే!
x
Highlights

హైదరాబాద్ మెట్రో.. దేశం లో ఇంత త్వరగా ప్రజాదరణ పొందిన మెట్రో ఇదొక్కటే. లక్షలమంది ప్రయాణీకులు రోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణీకుల...

హైదరాబాద్ మెట్రో.. దేశం లో ఇంత త్వరగా ప్రజాదరణ పొందిన మెట్రో ఇదొక్కటే. లక్షలమంది ప్రయాణీకులు రోజూ మెట్రోలో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రయాణీకుల సమస్యలకు మాత్రం పరిష్కారం దొరకడం లేదు. హైదరాబాద్‌లో మెట్రోకు ఆదరణ పెరిగింది. వేల నుంచి లక్షలకు ప్రయాణికుల సంఖ్య చేరింది. మెట్రో స్టేషన్లకు సమీపంలోని ప్రాంతాల నుంచి బైక్, కార్ల ద్వారా చేరుకుంటున్నారు. ఇక్కడ వాటిని పార్కు చేసి వారి గమ్యస్థానాలకు మెట్రోలో వెళుతున్నారు. కొన్ని మెట్రో స్టేషన్లలో మాత్రమే పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పార్కింగ్ ‌ఉన్న స్టేషన్లలో ఎలాంటి సౌకర్యం కల్పించలేదు. కనీసం షెడ్లు కూడా నిర్మించలేదు. దీంతో వాహనాలు ఎండలో ఎండుతూ వానలో తడుస్తున్నాయి. ఫీజులు మాత్రం భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. మెట్రో పార్కింగ్‌లో టూవీలర్‌కి గంటకు 10 రూపాయలు, ఫోర్ వీలర్‌కి 15రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.

ఫీజులు ఎంత వసూలు చేస్తున్నా.. సౌకర్యాలు కల్పించడం లో మాత్రం మెట్రో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇక పార్కింగ్ లేని స్టేషన్లలో పరిస్థితి మరింత దయానీయంగా ఉంటోంది. ఇంతగా ఆదరణ పొందిన మెట్రో మరింత అభివృద్ధి చెందాలంటే ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారించాల్సి ఉంటుందని ప్రయాణీకులు అంటున్నారు. పార్కింగ్ ఫీజులు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పార్కింగ్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. రద్దీ సమయంలో పార్కింగ్ ప్లేస్ ‌కూడా సరిపోవడం లేదని ప్రయాణికులంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories