ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్న ప్రియాంక కుటుంబీకులు

ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకున్న ప్రియాంక కుటుంబీకులు
x
Highlights

ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోని అధికారులు, రాజకీయ నాయకులు అంతా ముగిసిపోయాక మేమున్నామంటూ ముందుకొస్తారు.

ఆడపిల్లలు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోని అధికారులు, రాజకీయ నాయకులు అంతా ముగిసిపోయాక మేమున్నామంటూ ముందుకొస్తారు. అన్యాయం జరుగుతుంటే ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో చాలా మంది యువతుల జీవితాలు నాశనమవడమే కాకుండా వారి ప్రాణాలను కూడా కోల్పోతున్నారు. అదే కోణంలో జరిగింది ప్రియాంక రెడ్డి ఉదంతం కూడా. ఈ సంఘటన రాష్ట్రంలోనే సంచలనాన్ని సృష్టించింది.

తన బిడ్డ కనిపించడంలేదంటూ అర్థరాత్రి వేళ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా పోలీసులు పట్టించుకోలేదని. అంతే కాకుండా మీ అమ్మాయి ఎవరితో వెల్లిపోయిందో అని ఆ యువతిపై నిందలు కూడా పోలీసులు వేసారని కుటుంబీకులు వాపోయారు. ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు పట్టించుకుంటే తమ బిడ్డ తన కండ్ల ముందు తిరుగుతూ ఉండేదని ఆ తల్లి ఆవేదన చెందుతుంది. ఇప్పుడు ఎంత మంది వచ్చి ఆ తల్లిని పరామర్శించినా ఆ తల్లి కడుపుకోతను తగ్గించగలరా, దూరమైన తన బిడ్డను తిరిగి ఇవ్వగలరా అని ప్రశ్నిస్తున్నారు ప్రియాంక రెడ్డి బంధువులు, ఆత్మీయులు.

ప్రియాంక సంఘటన జరిగి రెండురోజులు గడుస్తుంది. ఈ రెండు రోజులుగా తమపై వెల్లువెత్తుతున్న పరామర్శలతో డాక్టర్ ప్రియాంకా రెడ్డి కుటుంబీకులు విసుగెత్తిపోతున్నారు.దీంతో ఈరోజు ఉదయం తమ ఇంట్లోకి రాజకీయ నాయకులు కానీ, మీడియా వాళ్లు , పోలీసులు, బయటి వ్యక్తులు ఎవరూ కూడా తమ ఇంటికి రావద్దంటూ, ఓ బోర్డును తగిలించారు. అంతే కాకుండా వారి ఇంటి గేటుకు లోపలి నుంచి తాళం వేసుకుని వారు ఇంట్లో ఉంటున్నారు. మమ్మల్ని పరామర్శించినంత మాత్రాన చనిపోయిన మా బిడ్డ తిరిగి వస్తుందా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కావలసింది పరామర్శలు కాదని, న్యాయం కావాలని అంటున్నారు. తాము ఇప్పుడున్న పరిస్థతులలో తమను మరింత బాధపెట్టొద్దని వేడుకుంటున్నారు. ప్రతిసారీ తమ ఇంటికి వచ్చి తమను అందరూ విసిగిస్తున్నారని ప్రియాంక కుటుంబీకులు వాపోతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories