తెలుగు రాష్ట్రాల్లో 11 రూట్లలో ప్రైవేటు రైళ్లు..

తెలుగు రాష్ట్రాల్లో 11 రూట్లలో ప్రైవేటు రైళ్లు..
x
Highlights

తెలుగు రాష్ట్రాల్లోని 11 రూట్లలో ఈ ఆర్థికి సంవత్సరంలో మరికొన్ని కొత్త రైల్లు పరుగులు తీయనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని 11 రూట్లలో ఈ ఆర్థికి సంవత్సరంలో మరికొన్ని కొత్త రైల్లు పరుగులు తీయనున్నాయి. ఇందుకు గాను పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో దక్షిణ మధ్య రైల్వే ప్రైవేట్‌ రైళ్లకు త్వరలో టెండర్లను ఆహ్వానించనున్నాయి. ఈ విషయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం రైల్వే జోన్‌ కోసం పనులు ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు.

ఇకపోతే కేంద్రం ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ లో గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 3 శాతం నిధులకు ఎక్కువగా విడుదల చేసారని తెలిపారు. గతేడాది రూ. 1,56,352 కోట్ల కేటాయిస్తే , ఈ ఏడాది 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 1,61,042 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికుల సౌకర్యార్ధం కొన్ని కొత్త రైలు సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకు గాను చర్లపల్లి-వారణాసి, లింగంపల్లి-తిరుపతి, చర్లపల్లి-పర్వేలి, విజయవాడ-విశాఖపట్నం, చర్లపల్లి-శాలిమార్, ఔరంగబాద్-పన్వెలి, సికింద్రాబాద్-గౌహతి, చర్లపల్లి- చెన్నై, గుంటూరు-లింగంపల్లి రూట్లను ఎంచుకుంది.

ఇక రూట్లవారీగా బడ్జెట్ చూసుకుంటే చర్లపల్లి టర్మినల్‌ విస్తరణకుగాను ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 5 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఎంఎంటీఎస్‌ రెండో దశకుగాను రూ. 40 కోట్లు ఇవ్వనున్నారని తెలిపారు. ఇక పోతే ఘట్కేసర్‌- యాదాద్రి ఎంఎంటీఎస్‌ ప్రాజెక్టుకు రూ. 10 లక్షలు కేటాయించారు.

ఇక ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా 100 రూట్లలో 150 కొత్త ప్రైవేట్‌ రైళ్లను ఈ ఏడాది ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపిన విషయం అందరికీ తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories