డబ్బుంటేనే డాక్టర్‌..పెరగనున్న వైద్య విద్య ఫీజులు

డబ్బుంటేనే డాక్టర్‌..పెరగనున్న వైద్య విద్య ఫీజులు
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

చిన్నప్పటినుంచి వైద్య చదువులు చదివి మంచి వైద్యులు కావాలనుకున్న పేద విద్యార్థులకు ఇప్పుడు ఈ చదువు అందని ద్రాక్షగా మారనుంది.

చిన్నప్పటినుంచి వైద్య చదువులు చదివి మంచి వైద్యులు కావాలనుకున్న పేద విద్యార్థులకు ఇప్పుడు ఈ చదువు అందని ద్రాక్షగా మారనుంది. ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లోని కన్వీనర్‌ కోటా సీట్ల ఫీజులు భారీగా పేంచే అవకాశాలు ఉన్నాయని కేంద్రం ప్రకటించింది.

ఇప్పటివరకూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సీట్లతో కలుపుకుని మొత్తం 4,900 ఎంబీబీఎస్‌ సీట్లున్నాయి. ఇక పోతే ప్రయివేటు మెడికల్‌ కాళాశాలల విషయానికొస్తే 1,500 వరకు కన్వీనర్‌ కోటా సీట్లున్నాయన్నారు.

వీటిలో ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లోని 50% సీట్లకు సంబంధించిన ఫీజును ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసి. మిగతా 50% కన్వీనర్‌ కోటా ఫీజులను కేంద్రం నిర్ధారించబోతోందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తదితర వర్గాలు వెల్లడి చేస్తున్నాయి.

దీంతో 2020–21 వైద్య విద్య ఫీజుల భారం మొత్తం విద్యార్థులపైనే పడే దిశగా కేంద్రం చర్యలు తీసుకోబోతోంది. దీంతో ప్రయివేటు మెడికల్‌ కళాశాలలు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లో ఫీజుల క్రమబద్ధీకరణపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం కావాలని ఎంసీఐ స్థానంలో ఏర్పడిన బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ (బోగ్‌)ను కేంద్రం తాజాగా ఆదేశించింది.

డీమ్డ్‌ వర్సిటీలను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఫీజులు పెంచడం వలన పేదవిద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతారు. దీంతో వారి చదువు వారికి పెను భారంగా మారనుంది. చిన్నప్పటి నుంచి వారు కన్న కళలకు నెరవేర్చుకోకుండా ఉండాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories