Top
logo

ఇంటర్మీడియట్‌ విద్యార్దులు ఆత్మహత్యల పై నివేదిక ఇవ్వండి : కోవింద్

ఇంటర్మీడియట్‌ విద్యార్దులు ఆత్మహత్యల పై నివేదిక ఇవ్వండి : కోవింద్
X
Highlights

సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు....

సంచలనం సృష్టించిన ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యల అంశంపై.. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించారు. వెంటనే నివేదిక అందజేయాలని.. కేంద్ర హోంశాఖను ఆదేశించారు. దీంతో వివరాలు కోరుతూ.. కేంద్ర హోంశాఖ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. గత జులై 1 న రాష్ట్ర బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో.. స్పందించిన రాష్ట్రపతి దీనిపై నివేదిక కోరారు. ఇటీవల ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళంతో.. సుమారు 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. మార్కులు తక్కువగా వచ్చాయని కొందరు.. పరీక్షలు బాగా రాసినా ఫేయిల్‌ అయ్యారని మరికొందరు ప్రాణాలు తీసుకున్నారని కథనాలు వచ్చాయి. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం స్పందించడం లేదని.. ఇంటర్‌బోర్డుతో పాటు.. పేపర్ వాల్యుయేషన్‌ చేసిన గ్లోబరీనా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. మృతిచెందిన విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదని.. తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ నుంచి ఈ నెల 7 న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి లేఖ అందింది.

Next Story