Top
logo

సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా ?

సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా ?
X
Highlights

టీ కాంగ్రెస్‌లో పార్లమెంట్ ‌స్ధానాల సమీక్ష సమావేశాలు మొక్కుబడగా జరుగుతున్నాయా? శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవి...

టీ కాంగ్రెస్‌లో పార్లమెంట్ ‌స్ధానాల సమీక్ష సమావేశాలు మొక్కుబడగా జరుగుతున్నాయా? శాసన సభ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన నేతలు .. సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదా ? పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై తమ అసంతృప్తిని తెలియజేసేందుకు సీనియర్ నేతలు .. సమాయత్తమయ్యారా ? లెట్స్ వాచ్ దిస్ స్టోరి

అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటామంటూ మాటల్లో చెబుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు .. ఆచరణలో మాత్రం ఆమడ దూరంలోనే ఉన్నారంటూ గాంధీ భవన్ వేదికగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్న సమయంలో .. అనుసరించాల్సిన వ్యూహాల కోసం నిర్వహిస్తున్న సమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయనే ఊహగానాలు వెలుబడుతున్నాయి. గాంధీ భవన్‌లో నిర్వహిస్తున్ప సమీక్ష సమావేశాలకు హేమ హేమీలు డుమ్ముకొడుతున్నారట.

ఇప్పటి వరకు 12 పార్లమెంట్ స్ధానాలపై పీసీసీ సర్వే నిర్వహించింది. ఇందులో మెజార్టీ సీనియర్ నేతలతో పాటు ఆయా నియోజకవర్గాల పరిధిలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ముఖం చాటేశారట. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న రేవంత్ రెడ్డి ,అజారుద్దీన్‌లు ఒక్క సమీక్ష సమావేశాంలో పాల్గొనలేదు. పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలవగా ఇప్పటి వరకు ఆత్రం సక్కు మినహా మరెవ్వరూ సమీక్షల్లో కనిపించలేదు. కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంపై పీసీసీలో చర్చ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిర్వహించిన సమావేశానికి సీనియర్ నేతలు హాజరు కాకపోవడం తీవ్ర సంచలనంగా మారింది. డీకే అరుణ, జైపాల్ రెడ్డి, సంపత్, వంశీచంద్ రెడ్డి, వంశీకృష్ణ వంటి సీనియర్ నేతలు మాట వరుసకు కూడా రాకపోవడం పార్టీ శ్రేణులను విస్మయ పరుస్తోంది. సీనియర్‌ నేతలతో పాటు ఏఐసీసీలో కూడా గుర్తింపు ఉన్న సురేష్ షెట్కార్ , మధుయాష్కీ గౌడ్ సమీక్షలకు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఓటమి తరువాత ఇంటికే పరిమితమైన జానారెడ్డి, పొన్నాల రెండో రోజు సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లినట్టు సమాచారం.

అయితే పీసీసీ వ్యవహారశైలి వల్లే మెజార్టీ నేతలు సమీక్షా సమావేశాలకు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఇన్‌చార్జ్‌ కుంతియా, పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు ఏక పక్షంగా వ్యవహరించడం వల్లే పార్టీ ఘోర పరాజయం మూట గట్టుకుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపధ్యంలో తమ అసంతృప్తిని తెలియజేసేందుకు సమీక్ష సమావేశాలకు హాజరుకావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నాయకుల పరిస్ధితి ఎలా ఉన్నా ... కార్యకర్తలు మాత్రం అసలు ఏం జరుగుతుందో తెలియక తికమక పడుతూ ..ఆందోళన చెందుతున్నారు.

Next Story