రేవంత్ గురించే మాట్లాడలేదు..తప్పును సరిదిద్దుకుంటా : పోసాని

రేవంత్ గురించే మాట్లాడలేదు..తప్పును సరిదిద్దుకుంటా : పోసాని
x
పోసాని కృష్ణ మురళి
Highlights

తెలుగు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం...

తెలుగు సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీంతో రేవంత్ రెడ్డి అభిమానులు పోసాని మీద విరుచుకుపడి సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఇక ఈ విషయంపై స్పందించిన పోసాని కృష్ణ మురళి ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడూ తాను రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేయలేదని అన్నారు. మొన్న నిర్వహించిన మీడియాసమావేశంలో కూడా రేవంత్ గురించి ఆయన ఏమీ మాట్లాడలేదని చెప్పారు. అయినా తన మాటలు రేవంత్ రెడ్డి అభిమానులను బాధపెట్టి ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. దీన్ని సరిదిద్దుకుంటానని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

నాకు తెలిసి గానీ, తెలియక గానీ నా లైఫ్‌‌లో రేవంత్‌ రెడ్డిగారిని వ్వక్తిగతంగా గానీ, రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు. ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు, సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుందని మాత్రమే అన్నాను. రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాడ్లడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి కాబట్టి, ఇది నా బాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి , ఆయన అభిమానులకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును సరిదిద్దుకుంటాను అని పోసాని ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories