శంషాబాద్ కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

శంషాబాద్ కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు
x
Highlights

విదేశాల్లో ఉద్యోగమంటూ తల్లిదండ్రులను నమ్మించాడు. పెళ్లి కోసం అంటూ స్వదేశం వస్తున్నట్లు నటిస్తూ హైటెక్ నాటకానికి తెరలేపాడు. తనపై గుర్తు తెలియని...

విదేశాల్లో ఉద్యోగమంటూ తల్లిదండ్రులను నమ్మించాడు. పెళ్లి కోసం అంటూ స్వదేశం వస్తున్నట్లు నటిస్తూ హైటెక్ నాటకానికి తెరలేపాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి డబ్బులు దోచికెళ్లినట్లు కుటుంబసభ్యులను నమ్మించాడు. పోలీసులు ఎంట్రీతో ఆ నాటకరాయుడి గుట్టు రట్టైంది. సినిమా స్టోరీని తలపించే ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది.

హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ లండన్ లో ఉన్నట్లు తల్లిదండ్రులను నమ్మించాడు. పెళ్లి ఫిక్స్ చేసిన తల్లిదండ్రులు స్వదేశం రావాలంటూ ప్రవీణ్ కు సూచించారు. అయితే పెళ్లి ఇష్టం లేకపోవడం ఇదే సమయంలో తాను లండన్ లేనన్న విషయం ఎక్కడ బయట పడుతుందోనని ఆందోళన చెందిన ప్రవీణ్ కిడ్నాప్ డ్రామా ఆడాడు. లండన్ నుంచి తాను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చానని, దారి మధ్యలో ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్ కిడ్నాప్ చేశాడని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. రెండు లక్షల యూకే కరెన్సీ, బంగారం దోచుకున్నాడని వాపోయాడు. ప్రస్తుతం తాను గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నట్లు చెప్పాడు.

ప్రవీణ్ ఫోన్ చేసిన వెంటనే అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రవీణ్ అసలు లండన్ వెళ్లలేదని తేల్చారు. చెన్నైలో ఉంటూ లండన్ లో ఉన్నట్లు కుటుంబసభ్యులకు నమ్మించాడని, పెళ్లి ఇష్టంలేక ఈ కిడ్నాప్ డ్రామా ప్రవీణ్ ఆడాడని పోలీసు విచారణలో వెల్లడైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories