బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యం

బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యం
x
Highlights

బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యమైంది.. ఏడు రోజుల క్రితం హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన సోని.. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవిశంకర్...

బీఫార్మసీ విద్యార్థిని సోనీ ఆచూకీ లభ్యమైంది.. ఏడు రోజుల క్రితం హయత్‌నగర్‌లో కిడ్నాప్‌కు గురైన సోని.. ప్రకాశం జిల్లా అద్దంకిలో కిడ్నాపర్ రవిశంకర్ వదిలేసి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.. అద్దంకి నుంచి సొనీని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఈనెల 23న కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నాపర్ రవి శేఖర్ కోసం గాలిస్తున్న సందర్భంలో అతడిపై గతంలో పలు కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద నిందితుడి చివరి సిగ్నల్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కిడ్నాపర్ రవి ఆచూకీ చెప్పిన వారికి రూ. లక్ష రూపాయలు పారితోషికం ఇస్తామంటూ పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. కిడ్నాపర్ రవిశంకర్ కోసం పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై,విజయవాడ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. తాజాగా యువతి ఆచూకీ లభ్యం కావడంతో పోలీసులు, ఆమె తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories