రెవెన్యూ కార్యాలయాల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం.. ప్రతి రెవెన్యూ ఆఫీస్‌లో భద్రత కట్టుదిట్టం

రెవెన్యూ కార్యాలయాల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం.. ప్రతి రెవెన్యూ ఆఫీస్‌లో భద్రత కట్టుదిట్టం
x
Highlights

రెవెన్యూ కార్యాలయాల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రెవెన్యూ ఆఫీస్‌లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని మండల ,...

రెవెన్యూ కార్యాలయాల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రెవెన్యూ ఆఫీస్‌లో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని మండల , ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని నిర్ణయించారు. పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

తహశీల్దార్ విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగుల్లో భయంతో వణికిపోతున్నారు. ప్రజల నుండి నిరసనలు వ్యక్తం అవుతుంటంతో పని చేయలేకపోతున్నామని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తహశీల్దార్ హత్య తర్వాత వరుసగా ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఉన్నతాధికారుల హామీతో కొన్ని సంఘాలు నిరసనలు విరమించాయి.

రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని భూపరిపాలన శాఖ నిర్ణయించింది. అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రక్షణ కోసం జిల్లా కలెక్టర్ వద్ద ఉన్న ప్రత్యేక నిధులను వాడుకోవాలని ఆదేశాలిచ్చింది. భూపరిపాలన శాఖ ప్రతి మండల కార్యాలయంలో కావాల్సిన మౌలిక సదుపాయాల వివరాలు పంపాలని ఆదేశించింది. తహశీల్దార్ కార్యాలయంలో వచ్చే బయటికి వెళ్లే దారిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆఫీసులో విధిగా అగ్నిమాపక పరికరాలు అమర్చుకోవడం ప్రజల విజ్నప్తుల పరిష్కారానికి నిర్ణీత సమయం నిర్ణయిస్తారు. రెవెన్యూ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు కొత్త జిల్లాలు , మండలాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల వివరాలు పంపాలని నిర్ణయం తీసుకున్నారు.

జిల్లా స్థాయిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారుల చట్టాలపై శిక్షణలు, అధికారుల చాంబర్లు, కోర్టుహాలును కోర్టు మెజిస్ట్రేట్‌కు అనుగుణంగా తీర్చిదిద్దే విధంగా సీసీఎల్‌ఏ అన్ని జిల్లాకలెక్టర్‌లకు సర్క్యూలర్ జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories