Top
logo

ప్రొఫెసర్‌ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలు

ప్రొఫెసర్‌ కాశీం ఇంట్లో పోలీసుల సోదాలు
X
ప్రొఫెసర్‌ ఖాసీం ఇంట్లో పోలీసుల సోదాలు
Highlights

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న...

ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ కాశీం ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఆయన ఇంట్లో సోదాలు చేపట్టారు. ఈ ఉదయం కాశీం ఇంటికి చేరుకున్న పోలీసులు మావోయిస్టులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సోదాల సందర్భంగా ఆయన ఇంటి దగ్గర కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ కాశీం ఇటీవలే విప్లవం సంఘం (విరసం) రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

అయితే, ప్రొఫెసర్‌ కాశీంపై 2016లో నమోదైన కేసులో భాగంగానే సోదాలు జరుగుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ములుగు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన ఈ కేసులో కాశీం ఏ-2గా ఉన్నారు. నాడు కాశీం కారులో విప్లవ సాహిత్యం దొరికినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇదే కేసులో మరోసారి సెర్చ్‌ వారెంట్లతో సోదాలు చేస్తున్నామని వెల్లడించారు.

Web TitlePolice Raids On OU Professor Kasim House
Next Story