పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన యువతుల హల్‌చల్‌ !

పబ్‌లో అశ్లీల నృత్యాలు.. పట్టుబడిన యువతుల హల్‌చల్‌ !
x
పబ్‌లో అశ్లీల నృత్యాలు
Highlights

హైదరాబాద్‌లో విష సాంస్కృతి ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. లక్షల్లో వచ్చే ఆదాయం, ఖరీదైన జీవితాలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ యువత తప్పుడు పనులు...

హైదరాబాద్‌లో విష సాంస్కృతి ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. లక్షల్లో వచ్చే ఆదాయం, ఖరీదైన జీవితాలతో విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ యువత తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌పై దాడి చేసిన పోలీసులు ఏకంగా 20 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు.

జూబ్లీహిల్స్‌లోని టాట్‌పబ్ రేవ్ పార్టీకి కేంద్రం అయ్యింది. అయితే దీనిని పోలీసులు చాకచక్యంగా భగ్నం చేశారు. ఈ రేవ్ పార్టీలో అశ్లీల నృత్యాలు చేస్తున్న 20 మంది యువతులను అరెస్ట్‌ చేశారు. పబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో దాడి చేశారు. దాడి సమయంలో అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే యువతులను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో వీడియోలు షూట్ చేస్తున్న మీడియా వారిపై దాడి చేసి వారి ఫోన్స్‌ని పగలగొట్టారు. వారిని ఇష్టానుసారంగా దూషించారు. పోలీసులు ఆ 20 మంది యువతులని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సిటీ నడి ఒడ్డులో ఈ ఘటన జరగడం ఇప్పుడు మరో సంచలనంగా మారింది.

మొన్నటికి మొన్న అర్ధరాత్రి హైవే పబ్బు నుంచి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇంటికి వెళ్తున్న యువతిని ఇద్దరు యువకులు వెంబడించారు. కొద్ది దూరం ఫాలో అయ్యాక మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పబ్బుల బయట లోపల ఇలాంటి ఘటనలు కోకొల్లలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విష సాంస్కృతి మొదట శివార్లలో మాత్రమే ఉండేది అలాంటిది ఇప్పుడు ఏకంగా సిటీ సెంటర్‌లోకి మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories