మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

మిస్సింగ్ కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు
x
Highlights

గత నెల 26వ తేదీన ఇంట్లో నుంచి బయటకి వెళ్లిన రోహిత అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంగతి విదితమే.

గత నెల 26వ తేదీన ఇంట్లో నుంచి బయటకి వెళ్లిన రోహిత అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైన సంగతి విదితమే. అయితే ఈ కేసులో ఎంతగానో శ్రమించి రోహిత ఆచూకీని ఎట్టకేలకు కనిపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే గతంలో రోహిత నానక్‌రాంగూడలోని ఆపిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తూ, చాదర్‌ఘాట్‌ లో నివాసముండేదని తెలిపారు. ప్రస్తుతం ఆమె అదే కంపెనీలో పనిచేస్తూ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని మంత్రి సెలెప్టియా అపార్ట్‌మెంట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోందని తెలిపారు. కొన్ని రోజులుగా తనకు తన భర్తకు మధ‌్య చిన్న చిన్న గొడవలు రావడంతో ఆమె భర్తకు దూరంగా ఉండి జీవనాన్ని సాగిస్తోందని తెలిపారు.

ఇదిలా ఉంటే గత డిసెంబర్‌ 26న మధ్యాహ్నం ఇంట్లో నుంచి రోహిత బయటికి వెళ్లిందని తిరిగి ఇంటికి రాలేదన్నారు. ఆమె సెల్‌ ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసి ఉండటంతో కంగారు పడిన ఆమె సోదరుడు పరిక్షిత్‌ డిసెంబర్‌ 29న గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేశాడన్నారు. ఆమెకు సంబంధించిన ఐడీ కార్డుతో పాటు ల్యాప్‌టాప్‌ను కూడా ఫ్లాట్‌లోనే వదిలి వెళ్లిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు ఎట్టకేలకు ఆమె ఆచూకీని కనుగొన్నారు. పూణెలో రోహిత ఉండడాన్ని కనిపెట్టి ఎట్టకేలకు ఈ కేసు మిస్టరీని ఛేదించారు. హైదరాబాద్‌ నుంచి పూణె వెళ్లేముందు రోహిత తన ఏటీఎం కార్డు నుంచి రూ. 80వేలు డ్రా చేసినట్టు పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉంటే రోహితను పూణెలో కనుగొన్న పోలీసులు కుటుంబ కలహాలతోనే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని భావిస్తున్నారు. బుధవారం సాయంత్రం వరకు పోలీసులు ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారని సమాచారం. కానీ రోహిత పూణెలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుందని, హైదరాబాద్‌ కు తిరిగి రావడానికి ఇష్టపడడం లేదని తెలుపుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories