కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..శిక్షణ తరగతులు ఎప్పుడంటే ?

కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..శిక్షణ తరగతులు ఎప్పుడంటే ?
x
Highlights

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాను ప్రభుత్వ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల ఫలితాను ప్రభుత్వ విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో మొత్తం 11 విభాగాల్లో 17156 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. సెప్టెంబరు 25న విడుదల చేసిన ఫలితాల్లో 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాత్రీ, పగలు అన్న తేడా లేకుండా ఎంతో కష్టపడి ఈ పరీక్షలను అభ్యర్థుల ఎదుర్కొన్నారు.

రాత పరీక్షల్లోనే కాకుండా, ఈవెంట్స్ లో కూడా ఉత్తీర్ణత సాధించారు, ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రిజల్ట్స్ వచ్చి నెలలు గడుస్తున్నా అభ్యర్థులకు ఇప్పటి వరకు కూడా శిక్షణ తరగతులు ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు శిక్షణను ఎప్పుడెప్పుడు అందిస్తారా, ఖాకీ దుస్తులను ఎప్పుడు ధరిస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఖాకీ దుస్తులను ధరించి వారి తల్లిదండ్రుల క‌ళ్లలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నారు.

ఈ నేపథ‌్యంలోనే తెలంగాణ ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. నూతన సంవత్సరంలో నూతన కానిస్టేబుల్లను తయారు చేయనుంది పోలీస్ శాఖ. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శిక్షణను సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభించనుంది. 9 నెలలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాల్లో అభ్యర్థులకు అనేక అంశాల్లో ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో దాదాపుగా 16 వేలకు పైగా అభ్యర్థులు పాల్గొననున్నారు. ఏఆర్ కానిస్టేబుల్, సివిల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మాత్రమే కాకుండా డ్రైవర్, మెకానిక్ పోస్టులకు ఎంపికైన వానికి కూడా జనవరి 17 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది.

ఈ అభ్యర్థులంతా జనవరి 16న సంబంధిత శిక్షణ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు. శిక్షణ కాలంలో అభ్యర్థుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగం, శిక్షణా సంస్థలకు పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories