పెళ్లి ఊరేగింపుతో 20 మందిపై కేసు నమెదు

పెళ్లి ఊరేగింపుతో 20 మందిపై కేసు నమెదు
x
Highlights

రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నందున పెళ్లిళ్లు చేయాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా ఖచ్చితంగా అధికారుల దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే.

రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో ఉన్నందున పెళ్లిళ్లు చేయాలన్నా, ఫంక్షన్లు చేయాలన్నా ఖచ్చితంగా అధికారుల దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండలం కొప్పోలులో జరిగిన ఓ పెళ్లికి పెద్దలు అనుమతి తీసుకున్నారు. కొద్ది మంది సమక్షంలో పెళ్లితంతును ముగించేసారు. పెళ్లి విందు పెట్టారు. ఇక్కడి వరకు బాగానే నడిచింది. అసలు కథ ఇక్కడ మొదలైంది. లాక్ డౌన్ కి ముందు ఎక్కడ వివాహం జరిగినా బ్యాండు బాజా మోగిస్తూ డాన్సులు వేస్తూ హంగామా చేసేవారు. వారు కూడా నిబంధనలను ఉల్లంఘించి బరాత్ ను నిర్వహించడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసారు.

పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే కొప్పోలు గ్రామంలో కరోనా కారణంగా పరిమిత కుటుంబ సభ్యులతో శివరాజ్‌, స్వాతిల వివాహం జరిగింది. తతంగం అంతా ముగిసాక రాత్రివేళ నిబంధనలను ఉల్లంఘించి పెళ్లిబృందంలోని యువకులు డ్యాన్సులతో హోరెత్తించారు. డీజేతో పెళ్లి ఊరేగింపు నిర్వహించారు. అది గమనించిన పెట్రోలింగ్‌ పోలీసులు పెళ్లిబృందంతోపాటు, డీజే, బ్యాండ్‌ మేళం వారు మొత్తం 20 మందిపై కేసు నమోదు చేశారు. వారిని స్టేషన్‌కు తీసుకొచ్చి హెచ్చరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories